అవి కెసిఆర్ వ్యక్తిగత వ్యాఖ్యలు: జానా

మంత్రివర్గంలో ఉన్నా లేకున్నా తాను ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతానని ఆయన అన్నారు. జలయజ్ఞం లోపాలపై తాను ముఖ్యమంత్రి కె. రోశయ్యకు లేఖ రాయడంలో ఏ విధమైన రాజకీయ ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ట పెంచడానికే తాను లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై ప్రభుత్వం సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఏ ప్రాజెక్టులు పూర్తి చేయగలం, ఏవి పూర్తి చేయలేం వంటి అంశాలను పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రాధాన్యత గల ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications