విశాఖ జిల్లాలో మావోల విధ్వంసం

Maoists
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులు బుధవారం తెల్లవారు జామున విధ్వంసానికి దిగారు. జికె వీధి మండలం లంకపాకల గ్రామంలో కాఫీ శుద్ధి విభాగాన్ని మావోయిస్టులు పేల్చేశారు. ఈ పేలుడులో భవనం ధ్వంసమైంది. దాదాపు పది లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. దాదాపు 50 మంది సాయుధ నక్సలైట్లు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం.

కాగా, మాజీ మావోయిస్టు సీతక్కకు దేహశుద్ధి చేశారు. పోలీసు ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తోందంటూ ఆమె మావోయిస్టులు దాడి చేశారు. అపస్మారక స్థితిలో పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ విధ్వంసాలకు దిగుతున్నారు. ఇదిలా వుంటే, మంగళవారం రాత్రి ఛత్తీస్ గఢ్ దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు సిఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+