'జగన్ వ్యాఖ్యలతో వైయస్ ఆత్మక్షోభ'

Shankar Rao
హైదరాబాద్: కడప ఎంపీ వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే పి.శంకర్‌ రావు అభ్యంతరం తెలియజేశారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేఖరులతో మాట్లాడారు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ వైయస్ హయాం నాటి స్వర్ణయుగం తెస్తాననడం ఆయన ఆత్మకు బాధ కలిగించేలా ఉన్నాయన్నారు. ఇందిరమ్మ పాలన తెస్తానని..2004లో పాదయాత్ర సందర్భంగా వైయస్ మాట్లాడిన మాటలను శంకర్‌రావు గుర్తు చేశారు. ఆ సెంటిమెంట్ ‌కు భిన్నంగా జగన్ మాట్లాడడం తగదన్నారు.

శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ముందుగా మహబూబ్‌నగర్ జిల్లాను ఎంపిక చేసుకోవడం సంతోషకరమన్నారు. 'అది అతి పెద్ద జిల్లా. 65 మండలాలున్నాయి. 178 కిలోమీటర్ల పొడవుంది. కృష్ణా, తుంగభద్రలు జిల్లాలో ప్రవహిస్తున్నా..ఆకలి చావులున్నాయి. పేరు గడించింది. వ్యవసాయ ఉత్పత్తి చాలా తక్కువ' అని వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో వైయస్, రోశయ్య ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని, అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడతామని వారు చెప్పిన విషయాన్ని శంకర్‌రావు గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+