రోశయ్య పర్యటనలకు ప్రత్యేక విమానం

నిజానికి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే 15 సీట్ల సామర్థ్యమున్న అధునాతన విమానాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అయితే నిధుల విడుదలకు అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న రోశయ్య నిరాకరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పది ప్రాంతాల్లోనే విమానాలు దిగడానికి రన్ వేలు ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా ప్రాంతీయ విమానాశ్రయాల పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త విమానం కొనుగోలు ప్రతిపాదనలేమీ తమ దృష్టికి రాలేదని పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications