కొచ్చి: దుబాయ్ నుంచి కొచ్చి వస్తున్న ఎమిరేట్స్-777 బోయింగ్ విమానానికి ఆదివారం పెనుముప్పు తప్పింది. గాలిలోకి ఎగిరిన తర్వాత అదుపు తప్పడంతో విమానాన్ని కొచ్చి విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు.
ఈ విమానం గాలిలో 18వేల అడుగుల నుంచి 2వేల అడుగులకు ఒక్కసారిగా కిందికి వచ్చింది. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన ఫైలట్లు విమానాన్ని సురక్షితంగా దించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.