అమెరికా అల్లుడి పైశాచికత్వం

లావణ్యది విశాఖ పట్నం. వరకట్న పిశాచి రామకృష్ణది విజయవాడ. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఏనిమిదేళ్లుగా భర్త పెట్టిన నరకాన్ని భరిస్తూ చివరకు న్యాయం కోసం రోడ్డెక్కారు లావణ్య. ఓ ప్రైవేట్ ఛానల్‌తో తన గోడంతా వేల్లబోసుకున్నారు. ఆ చీడపురుగు(తన భర్త)ని వదిలి పెట్టేది లేదని, మరో మహిళ అతని వరకట్నదాహానికి బలి కాకూడదని లావణ్య అంటున్నారు.
రామకృష్ణతోపాటు అతని తల్లిదండ్రులపై లావణ్య గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మగ పిల్లాడి కోసం మూడు సార్లు అబార్షన్ చేయించారని, పైగా మతిస్థిమితం లేకనే అబార్షన్ అయినట్లు చిత్రీకరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లుగా పెళ్లయిన మొదటి రోజునుంచి తనను మానసికంగా, శారీరకంగా తన భర్త వేధించారని లావణ్య పేర్కొన్నారు. తనకు పిచ్చి ఉందని, తనను కత్తి పొడవడానికి ప్రయత్నించిందని రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడని కూడా లావణ్య పోలీసులకు తెలిపారు.












Click it and Unblock the Notifications