అమెరికాలో భారత వైద్యుడి హత్య

తూర్, వాంగ్‌లు 2008లో బ్లూక్లిన్ లోని కింగ్స్ బ్రూక్ యూదుల ఆస్పత్రిలో పని చేశారు. తూర్ మాదిరిగానే వాంగ్ కూడా కింగ్స్‌బ్లూక్ మెడికల్ రెసిడెన్సీ శిక్షణకార్యక్రమంలో సభ్యుడు. ఈ శిక్షణ కార్యక్రమం 2006 జూలైలో ప్రారంభమైంది. అయితే, రెండేళ్ల తరువాత వాంగ్‌ని తొలగించారు. యూదుల ఆస్పత్రిలో ఉన్న వైద్యసిబ్బంది (తూర్ తో సహా) చైనీయులను వేధించిసూటిపోటి మాటలతో అవమానపర్చారని వాంగ్ ఆరోపించారు. అయితే, వాంగ్ తన విధులకు సక్రమంగా హాజరుకాకుండా ఇబ్బంది కలిగించేవాడని తూర్ ఫిర్యాదుచేశారు. ఒక గంట తరువాత వాంగ్ తూర్ తో వాగ్వాదానికి పాల్పడి బెదిరించాడు. దీనిపై వాంగ్ నుంచి తన ప్రాణానికి హాని ఉందని తూర్ ఫిర్యాదు చేశాడు. పాత కక్ష కారణంగానే తూర్ ని వాంగ్ కాల్చి చంపి నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.












Click it and Unblock the Notifications