హైదరాబాద్ కు వందశాతం రక్షణ: ఖాన్

హైదరాబాదులోని ప్రధానమైన భవనాలు, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు పూర్తి భద్రతా చర్యలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మాల్స్ పోలీసుల సూచనలు పాటించాలని ఆయన ఆదేశించారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల అనుమానిత యువకులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన పోలీసులకు సూచించారు. హైదరాబాదులోని తనిఖీలు పెంచాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. ఇటీవల హైదరాబాదులో మత ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఉగ్రవాద ముప్పును నివారించేందుకు ప్రభుత్వం ఖాన్ కు పూర్తి అధికారాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications