శ్రీశ్రీ నాకు తెలుసు: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి శ్రీశ్రీ తనకు వ్యక్తిగతంగా తెలుసునని ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చెప్పారు. హైదరాబాదులోని జూబిలీహాల్ లో శుక్రవారం జరిగిన శ్రీశ్రీ శతజయంతి ఉత్సవ సభలో ఆయన మాట్లాడారు. శ్రీశ్రీతో తనకు విచిత్ర సంఘటన ఎదురైందని ఆయన చెబుతూ దాన్ని వివరించారు. తాను విశాఖపట్నం సితార అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వెళ్లానని, అప్పుడు శ్రీశ్రీని చూశానని, వ్యక్తిగత పరిచయం ఏర్పడిందని ఆయన అన్నారు.

శ్రీశ్రీ తానున్న గదిలో సిగరెట్టు కాలుస్తున్నారని, ఆ సమయంలో తాను వెళ్లానని, తాను చూస్తుంటే సిగరెట్ కాల్చడం అభ్యంతరమా అని అడిగారని, తాను లేదన్నానని చెప్పారు. అభ్యంతరమైతే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుదామనుకున్నానని శ్రీశ్రీ తనతో అన్నారని ఆయన చెప్పారు. అంత సీరియస్ రచయిత ఇంత సరదా మాట్లాడడం తాను మరిచిపోలేకపోయానని ఆయన అన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా పాల్గొన్నారు. శ్రీశ్రీతో తనకు వ్యక్తిగత పరిచయం లేదని, ఒకటి రెండు సార్లు చూశానని ఆయన చెప్పారు. శ్రీశ్రీ సతీమణి సరోజ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+