హైదరాబాద్: ప్రముఖ నటుడు బాలకృష్ణ హీరోగా నటించిన సింహా సినిమా టైటిల్ పై వివాదం ప్రారంభమైంది. సింహా టైటిల్ తనదేనని ఒయు విద్యార్థి వినోద్ అంటున్నాడు. దీంతో వివాదం మొదలైంది. ఈ సినిమాను తెలంగాణ జిల్లాల్లో అడ్డుకుంటామని ఒయు జెఎసి హెచ్చరించింది.
సింహా టైటిల్ తనదేనంటూ తాను గతంలోనే ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసికెళ్లానని, అయితే వారు స్పందించలేదని వినోద్ అన్నాడు. ఏప్రిల్ 30వ తేదీన సింహా సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ వివాదం తలెత్తడం విశేషం.