నాకు మగతనం లేదు: నిత్యానంద

నిత్యానంద ఆస్తుల విలువ రూ.32 కోట్లకు పైగా ఉన్నట్లు సీఐడీ ఆర్థిక విభాగం అధికారులు లెక్కించినట్లు తెలుస్తోంది. దేశ విదేశాలకు చెందిన పది బ్యాంకుల్లో ఆయన పేరుపై ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, నిత్యానంద బెయిల్ పిటిషన్ విచారణ మే 3కు వాయిదాపడింది. రామనగర జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఈ పిటిషన్‌ను విచారించింది.
నిత్యానందతో పాటు రాసలీలల సీడీలో కనిపించిన సినీనటి రంజిత దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి ఆమె నగరానికి వచ్చారు. సీఐడీ అధికారులను సంప్రదించగా ఆమెను రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications