హైదరాబాద్ : ముఖ్యమంత్రి రోశయ్యతో ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి శనివారం సచివాలయంలో భేటీ అయ్యారు. అసంఘటిక కార్మిక సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలవల్ల పంట నష్టం, విద్యుత్ కోత, ట్రిఫుల్ ఐటీ సీట్ల కుదింపు, విద్యార్ధుల స్కాలర్‌షిప్‌ల విడుదల తదితర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు.
తాను వివాద రహితుడనని చిరంజీవి ముఖ్యమంత్రితో బేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.