చిత్తూరు: చిత్తూరులోని సబ్ జైలులో గంటా ప్రసాద్ అనే ఖైదీ చెట్టెక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అధికారులు తనను వేధిస్తున్నారంటూ అతను ఆరోపిస్తూ చెట్టెక్కాడు. జైలులో ఖైదీలకు, అధికారులకు మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ గొడవ నేపథ్యంలో ప్రసాద్ ఆ బెదిరింపులకు పాల్పుడుతున్నట్లు తెలుస్తోంది.
గంటా ప్రసాద్ డిమాండ్ ఏమిటో తెలుసుకోవడానికి జైలు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అతన్ని చెట్టుపైకి దింపడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.