హైదరాబాద్: ఆదివారం ఉదయం నగరంలోని ఆల్వాల్ రైతుబజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక దుకాణాలు దగ్థమయ్యాయి. దాదాపు 30 దుకాణాలు కాలిపోయినట్టు రూ. 15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు. ప్రమాదం విద్యుత్ షార్ట్‌సర్య్కూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అగ్నిప్రమాదాలకు సంబంధించి తాజాగా అనేక మార్గదర్శకాలు రూపొందించి అమలు చేస్తున్నప్పటికీ ఇలా జరగడం చర్చనీయాంశమైంది.