బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు కర్నాటకలో ఓ మంత్రి పదవీకి ఎసరు తెచ్చాయి. స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో కర్నాటక మంత్రి హర్తాలు హాలప్ప ఆదివారం రాజీనామా చేశారు. ఆయన ఆవిడపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎన్ డి టివి ప్రసారం చేసింది.
ఈ విషయం ఆదివారం ఉదయం విజయ కర్నాటక పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. హాలప్ప ఎడ్యూరప్ప ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉన్న మంత్రి. ఒక మహిళ విషయంలో ఆయన ఇబ్బందుల్లో పడడం చర్చనీయాంశమైంది.