• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నేడు ప్రపంచ నవ్వుల పండుగ

By Santaram
|

Hyderabad
హైదరాబాద్: నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం. కడుపుబ్బా నవ్విన తర్వాత ఎలా ఉందని అడిగితే..చాలా మంది 'చాలా హాయి'గా ఉందంటారు. కానీ ఈ బిజీ జీవితంలో నవ్వు మాయమైపోయింది. నలుగురు కలిసి హాయిగా నవ్వుకునే రోజులు లేవిప్పుడు. నవ్వును ఓ యోగం చేసేశారు. నవ్వు అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో నవ్వు కోవడం కోసం ప్రత్యేకంగా 'లాఫింగ్ క్లబ్'లు నగరంలో ఎన్నో ఏర్పడ్డాయి.

నవ్వుల క్లబ్ ఉద్యమం 65 దేశాల్లో విస్తరించింది. ఆరోగ్యం, ఆనందం, విశ్వశాంతి కోసం జాతి మతాలకు అతీతంగా లాభపేక్ష లేకుండా ఈ క్లబ్‌లు ఏర్పడుతున్నాయి. నగరంలోనూ పలు పార్కుల్లో ఈ క్లబ్‌కు చెందిన సభ్యులు ఒక చోట గుమిగూడి హాయిగా నవ్వుకుంటారు. పబ్లిక్ గార్డెన్‌ లో 'ఏబీసీ లాఫింగ్ క్లబ్'ను 1997 నుంచి షరీన్ పంజ్వాని నిర్వహిస్తున్నారు. ఏబీసీకి నగరంలో 15 శాఖలున్నాయి. ఒక్కొ దాంట్లో 40 నుంచి 50 మంది సభ్యులు ఉంటారు. అన్ని వయస్సుల వారు ఈ క్లబ్‌లో సభ్యులుగా ఉన్నట్లు శ్రీమతి అరుణ్ అగ్రవాల్ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X