హైదరాబాద్: ఆస్పత్రులు రోగులకు సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆయన సోమవారంనాడు సికింద్రాబాదులోని సన్ షైన్ ఎముకల ఆస్పత్రిని సందర్శించారు. కార్పొరేట్ ఆస్పత్రులు కూడా పేద రోగులకు సేవలు చేయాలని ఆయన అన్నారు.
రోగుల అవసరాలు తీర్చే విధంగా సౌకర్యాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో, రోగులకు సేవలు అందించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు.