రాజమండ్రి: పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ ఖైదీ సోమవారం రాజమండ్రి వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకాడు. రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి కొవ్వూరు న్యాయస్థానానికి తీసుకుని వెళ్తుండగా జాన్ బాబు అనే ఖైదీ గోదావరి నదిలోకి దూకాడు. అతన్ని ఆంధ్రప్రదేశ్ టూరిస్టు సిబ్బంది రక్షించింది. అతన్ని ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన జాన్ బాబును కొవ్వూరు తీసుకుని వెళ్తుండగా వంతెనపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనం నిలిచిపోయింది. ఈ సమయంలో జాన్ బాబు పోలీసుల నుంచి తప్పించుకుని వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకాడు.