హైదరాబాద్: హైదరాబాదులోని శామీర్ పేటలో గల జవహార్ నగర్ డంపింగ్ యార్డ్‌లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. డంపింగ్ యార్డులో కూరుకుపోతున్న సమయంలో వారు పెట్టిన కేకులను అటుగా వచ్చినవారు విని పోలీసులు, మున్సిపల్ అధికారులకు తెలియజేవారు. దాంతో వారు రంగంలోకి దిగారు.
ప్రొక్లెయిన్లతో చెత్తను ఎత్తివేస్తూ మాయమైనవారి కోసం గాలిస్తున్నారు.గల్లంతైనవారిని రహీమ్, కాజా, వాసులుగా అధికారులు గుర్తించారు. ఇదే తరహాలో వారం రోజుల క్రితం ఓ మహిళ గల్లంతైంది.