జగన్మోహన్ ఆస్తులు రూ. 3.5 కోట్లపైనే

హైదరాబాదులోని హిమాయత్ నగర్, అంబర్ పేటల్లో రెండు ఇళ్లు గుర్తించినట్లు ఎసిబి అధికారులు చెప్పారు. విశాఖపట్నంలో కూడా ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. శేరిలింగంపల్లి, హయత్ నగర్ ల్లో ఆరు ప్లాట్లు ఉన్నట్లు వారు చెప్పారు. ఇంకా పలు ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. అర కిలో బంగారం, నగదు, కారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బ్యాంక్ ఖాతాలు, లాకర్లు చూడాల్సి ఉందని ఎసిబి అధికారులు చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో జగన్మోహన్ ఆస్తుల కోసం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications