గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తున్న వ్యక్తి నుంచి దుండగులు వాటిని లాక్కుని పారిపోయారు. కాంచనగంగ రైస్ మిల్లుకు చెందిన ఉద్యోగి మాధవరావు ఎస్పీఐ నుంచి పది లక్షల రూపాయలు డ్రా చేశాడు.
అది గమనించి దుండగులు వాటిని లాక్కుని పారిపోయారు. దీనిపై మాధవరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.