• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కర్ణాటక మాజీ మంత్రి కనబడుటలేదు!

By Santaram
|

Haratal Halappa
షిమోగా: కర్నాటక మాజీ మంత్రి కనబడుటలేదు! స్నేహితుని భార్యపై అత్యాచారం చేయడానికి యత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక మాజీ మంత్రి హర్తాల్ హాలప్పకు ఏంటిసిపేటరీ బెయిల్‌ను కోరుతూ ఆయన తరపు న్యాయవాది షిమోగాలో అప్లికేషన్ దాఖలు చేశారు. సంఘటన జరిగిందంటున్న రోజున తమ క్లయింట్ అసలు ఊళ్లోనే లేరని ఆయన వాదించారు. ఇదంతా ప్రత్యర్థులు పన్నిన కుట్రగా పేర్కొంటూ బెయిల్ లభించిన అనంతరం తమ క్లయింట్ పూర్తి వాస్తవాలు వెల్లడించగలరని ఆయన వివరించారు.

గత మూడు రోజులుగా హాలప్ప కనిపించడంలేదని బెంగుళూరులో బుధవారంనాడు ప్రసారసాధనాలలో వార్తలు వెలువడ్డాయి. స్నేహితుని భార్యపై అత్యాచారం చేయడానికి యత్నించిన విషయం వెలుగులోకి వచ్చినప్పటినుంచి హాలప్ప ఎవ్వరికీ కనిపించడం లేదని ప్రసార సాధనాలు పేర్కొంటుండగా, అదే సమయంలో ఆయన తరఫు న్యాయవాది తమ క్లయింట్ అదృశ్యం కాలేదని వెల్లడించారు. బెయిల్‌కోసం యత్నిస్తున్న విషయాన్ని ఆయన ఖరారు చేస్తూ, సెల్ ఫోన్‌లో కనిపిస్తున్న దృశ్యాలన్నీ తయారుచేసినవే తప్ప వాస్తవాలు కావని ఆయన వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X