కాకినాడ: అభిమానుల అత్యుత్సాహం చిరంజీవికి బాధ కలిగించింది. కార్యకర్తలు, అభిమానుల అత్యుత్సాహంతో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కిందపడబోయారు. వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో గురువారం జరుగుతున్న ఓ కార్యక్రమానికి ఆయన హాజరు అయ్యారు.
తమఅభిమాన నటుడు, పార్టీ అధ్యక్షుడుని చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా తోసుకు రావటంతో తొక్కిసలాట జరిగింది. దాంతో చిరంజీవి కార్యకర్తలపై అలకబూని అర్థాంతరంగా వెనుదిరిగారు.