వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెసు ఎమ్మెల్యే బస్వరాజు సారయ్యకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. కొత్తవాడ ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై తెలంగాణవాదులు పెట్రోల్ పోశారు. తెలంగాణకు మద్దతుగా బస్వరాజు సారయ్య తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేతో పాటు ఎస్ ఐ నరేందర్‌పై కూడా ఆందోళనకారులు పెట్రోలు చల్లారు. ఈ సందర్భంగా 15మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.