రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణ

Mahaboob Nagar
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్‌ చౌరస్తా వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. వీరంతా అడ్డాకుల మండలం వేముల, శంషాబాద్‌ ప్రాంతాలకు చెందిన వారు. మృతుల్లో పలువురు అడ్డాకుల జడ్పీటీసీ సభ్యుడి సమీప బంధువులు ఉన్నారు. వీరు పుణ్యక్షేత్రాలు సందర్శించి తిరుగు ప్రయాణంలో మృత్యుముఖానికి చిక్కారు. మృతుల్లో అయిదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భక్తులంతా ఓ జీపులో కర్నూలునగరం దాటి పది కిలోమీటర్లు ప్రయాణించాక ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. రాయచూరు నుంచి వస్తున్న లారీని జీపు డ్రైవర్‌ సరిగా అంచనా వేయకపోవటం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

చనిపోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది వివరాలు తెలిశాయి. వారిలో చంద్రకళ, యాదమ్మ, కృష్ణవేణి అలియాస్‌ చిట్టి, కృష్ణవేణమ్మ, సత్యనారాయణ, రమేష్‌, నరసింహులు, యుగంధర్‌ దుర్మరణం చెందినట్లు సమాచారం. గాయపడిన మరో వ్యక్తి ప్రకాష్‌కు అత్యవసర సేవలు అందిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పోలీస్‌ అధికారులు నారాయణ, సాయన్న పరిశీలించి మృతదేహాలను తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+