ఇప్పుడే విభజన వద్దు: ఆంధ్ర మేధావులు

ఆంధ్రా మేధావులు, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తోపాటు ప్రొఫెసర్ పి.ఎ.రామకృష్ణరాజు, జి.పాపారావు, బి.ఆర్.రావు, కె.తమ్మారెడ్డి, ఎస్‌కే మస్తాన్, కె.వెంకటేశ్వర్లు, ఎస్వీ నారాయణ, జీటీ నరసింహారావు, ఆర్వీఎస్‌ఎన్ రాజు గురువారం శ్రీకృష్ణ కమిటీ ముందు వారి వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన వల్ల రెండు ప్రాంతాల్లో తలెత్తే నీటి సమస్య గురించి ప్రొఫెసర్ రాజు శాటిలైట్ చిత్రాలతో వివరించారు. నీటి సమస్యపై ప్రత్యేకంగా ఇద్దరు నిపుణుల కమిటీ నియమించామని, వారితో సమావేశానికి త్వరలో ఆహ్వానిస్తామని జస్టిస్ శ్రీకృష్ణ తమకు చెప్పారని చలసాని శ్రీనివాస్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications