కెసిఆర్ సంస్కారం నేర్చుకోవాలి: చిరు

Chiranjeevi
కాకినాడ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముందు సంస్కారంతో మాట్లాడడం నేర్చుకోవాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. కెసిఆర్ ఎలా అంటే తాను అలా మాట్లాడలేనని ఆయన అన్నారు. తెరాస నేత కేసీఆర్‌ చేసిన విమర్శలపై స్పందిస్తూ పోలవరం వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ ప్రయోజనం పొందుతాయని చెప్పారు. ప్రాధాన్య క్రమంలో ముందున్న పోలవరం గురించి ఉద్యమిస్తున్నానని, ఆ తర్వాత ప్రాణహిత తదితర ప్రాజెక్టులకూ మద్దతిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో యాత్రకు ముందు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేసిన వ్యాఖ్యలను చిరంజీవి తిప్పికొట్టారు. పొన్నాల ఒక రాష్ట్రానికి మంత్రా? లేక ఒక ప్రాంతానికి మాత్రమే మంత్రా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేత లగడపాటి రాజగోపాల్‌ తదితరులు ఎవరైనా పోలవరం కోసం కలిసి వస్తే స్వాగితిస్తామన్నారు. ప్రజారాజ్యం పార్టీకి ప్రజాబలం వున్నా, నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం లేదని చిరంజీవి అంగీకరించారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు సరిగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లే దశాబ్దాల నుంచి పోలవరం ప్రాజెక్టు సాకారం కాలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన చేస్తున్న బస్సుయాత్ర రెండోరోజు కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలో సాగింది. పోలవరం కోసం పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. గతంలో దేవాదుల కోసం చంద్రబాబు నాయుడు, ప్రాణహిత-చేవెళ్ల కోసం కేసీఆర్‌, జలయజ్ఞం కోసం వైయస్ రాజశేఖర రెడ్డి చేసింది రాజకీయమే అయితే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం తాను చేస్తున్న ఉద్యమం కూడా రాజకీయమే అన్నారు. మేం ఉద్యమం చేపడితే అయిపోయిన పెళ్లికి చిరంజీవి బాజాలు వాయిస్తున్నారంటున్నారు. కానీ ఇంకా పెళ్లే అవ్వలేదు. పెళ్లిచూపులు మాత్రమే అయ్యాయి. ఒకవేళ అది పెటాకులైతే? అందుకే మేం ప్రజల పక్షాన పోలవరం ప్రాజెక్టు అనే లోకకల్యాణాన్ని జరిపించేందుకు ఉద్యమిస్తున్నాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+