బాలయ్యతో సినిమా తీసినా..: దాసరి

బాలకృష్ణ తనకు ఆప్తుడు, కావాల్సినవాడని ఆయన అన్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తనకు అప్తుడు, కావాల్సినవాడని ఆయన అన్నారు. ఎవరి భావాలకు అనుగుణంగా వారు పార్టీలు పెట్టుకున్నారని, అంత మాత్రాన సినిమా రంగంలో విడివిడిగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన అవసరం ఏర్పడినప్పుడు కాంగ్రెసు కార్యకలాపాల్లోకి దూకుతానని ఆయన చెప్పారు. మంత్రి మండలి సభ్యులతో విభేదాలు ఉంటే ముఖ్యమంత్రి రోశయ్యనే చెప్పి ఉండేవారని ఆయన అన్నారు. మంత్రి మండలి సభ్యులతో రోశయ్యకు విభేదాలు లేవని ఆయన అన్నారు. అవసరం వచ్చినప్పుడు తెలంగాణపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications