రాజకీయాల్లోకి రాను: శేఖర్ కమ్ముల

సమాజంలోని నల్లధనాన్ని వెలికి తీయడం ఖచ్చితంగా సాధ్యపడుతుందని ప్రేక్షకుల ప్రశ్నకు సమాధానం చెప్పారు. మనకు సాధ్యపడదని అనుకున్న రోజున బతకటమే వృథాని ఆయన అభిప్రాయపడ్డారు. తాను భవిష్యత్‌లో నటనలోకి, రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. డబ్బు, కీర్తి, ప్రతిష్టలు సంపాదించాలనే ఉద్దేశంతో సినీ రంగంలోకి రావద్దని యువతకు సూచించారు. సినిమానే జీవితంగా భావించి, తమపై తమకు నమ్మకం ఉంటేనే పరిశ్రమలో మనుగడ సాధ్యమని చెప్పారు. దేశంలో అవినీతి అంతానికి ఎంత మంది శేఖర్ లు రావాలని ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు... రావాల్సింది శేఖర్ కమ్ములలు, సినిమాలు కాదని, నిజమైన లీడర్ లు, అవినీతిపై పోరాటం చేసే రాజకీయ నాయకులని సమాధానమిచ్చారు. దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.












Click it and Unblock the Notifications