హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో వ్యభిచార సెంటర్లపై దాడులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న వ్యభిచారంపై పోలీసులు దృష్టి సారించారు. నగర పోలీసు కమిషనర్‌ ఏకే ఖాన్‌ ఆదేశాల మేరకు పశ్చిమ, మధ్య, ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పలు ప్రాంతాల్లోని వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మసాజ్‌ సెంటర్‌, ఫ్రెండ్షిప్‌ క్లబ్‌, బ్యూటీ స్పా, ఎస్కార్ట్స్‌ సర్వీసెస్‌ ముసుగులో కొనసాగుతున్న వ్యభిచార కార్యకలాపాల గుట్టురట్టయిందని డీసీపీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. మసాజ్‌ సెంటర్ల పేరుతో దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, ఆకర్షితులైన యువకులతో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయించుకుని నిందితులు తమ వ్యవహారాలు నడుపుతున్నారని ఆయన తెలిపారు. దాడుల్లో 10 మంది నిర్వాహకులను అరెస్టు చేసి..విదేశీ యువతితో సహా పలువురికి విముక్తి కల్పించామని డీసీపీ చెప్పారు.

న్యూబోయిన్‌పల్లి ప్రాంతంలోని తులసీ ఆయుర్వేదిక్‌ మసాజ్‌ సెంటర్‌పై దాడి చేసిన బినోయ్‌ థామస్‌, పి.ప్రమోద్‌కుమార్‌లను అరెస్టు చేసి సన బేగంను రక్షించారు. సికింద్రాబాద్‌ బాలమ్‌రాయ్‌లోని వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకుడు బి.బాలును అరెస్టు చేసి సీమా సర్చార్‌ను రెస్క్యూ చేశారు.

పంజగుట్టలోని రెడ్‌రోజ్‌ మసాజ్‌ పార్లర్‌పై దాడి చేసి వి.పండును అరెస్టు చేసి అన్వర్‌ బీబీకి విముక్తి కల్పించారు. బీఎస్‌ మక్తాలోని మసాజ్‌ సెంటర్‌పై దాడి చేసి పి.చంద్రమౌళిశాస్త్రిని అరె స్టు చేసి ఓ యువతిని రక్షించారు.

అమీర్‌పేటలోని ఓ వ్యభిచార కేంద్రంపై దాడి చేసి ఆరీఫుల్లా, లకి, అర్జున్‌లను అరెస్టు చేసి ఇద్దరు యువతులకు విముక్తి కల్పించారు. సైఫాబాద్‌ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి అమిత్‌ అరోరా, దీపక్‌ గుప్తాలను అరెస్టు చేశారు. వీరి చెరలో ఉన్న ఉబ్బెకిస్థాన్‌ యువతికి విముక్తి కల్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X