అవినీతి మంత్రులను తొలగించండి: బాబు

Chandrababu Naidu
ఒంగోలు: అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులను తొలగించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కె. రోశయ్యను డిమాండ్ చేశారు. ఆయన సోమవారం ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా సుబాబుల్ రైతుల సమస్యలపై మాట్లాడారు. ప్రభుత్వంలోని పెద్దలు దోచుకు తింటున్నారని, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆయన అన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం మింగారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని అవినీతి మంత్రులపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా డబ్బులు దండుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.

రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. సుబాబుల్ ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆయన అన్నారు. గెలాక్సీ గ్రానైట్ గనులను తక్కువ ధరలకు కొంత మందికి మాత్రమే కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+