జగన్ చే వైయస్ వెబ్ సైట్ ఆవిష్కరణ

వైయస్ ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పేదల అభ్యున్నతికి కృషి చేసిన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా వెబ్ సైట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కొండమడుగుల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మహానేత వైయస్ ఆర్ పై ప్రత్యేకంగా వెబ్ సైట్‌ను రూపొందించామన్నారు. మరిన్ని వివరాలను www.ysrr.org వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ ఆర్‌పై ఉన్న అపారమైన అభిమానంతోనే వెబ్ సైట్‌ను రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, ఇంద్ర, విద్యాసాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications