బాలయ్య సినిమాల్లో బిజీ: చంద్రబాబు

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో బాగా పని చేశారని, ఎప్పుడు ఎవరు రాజకీయాల్లోకి రావాలో తమ కుటుంబ సభ్యులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. బాలకృష్ణను రాజ్యసభకు పంపాలా, వద్దా అనే విషయంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. బాలయ్యకు తెలుగుదేశం పార్టీలో సరైన సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. మంత్రుల్లో ప్రతి ఒక్కరూ మధుకొడాలే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసుకు, అవినీతికి అవినాభావ సంబంధం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications