జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ

Warangal
వరంగల్: గత రెండు రోజులుగా చేస్తున్న సమ్మెను వరంగల్లోని ఎంజిఎం ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు మంగళవారం విరమించారు. ఉపకార వేతనాల మంజూరులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా వారు సోమవారం సమ్మె ప్రారంభించారు. మంగళవారం అత్యవసర సేవలను కూడా బహిష్కరించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం వైద్య సేవలు అందక నలుగురు రోగులు మరణించారు.

సమ్మె విరమించాలని జాయింట్ కలెక్టర్ చేసిన విజ్ఞప్తిని వారు తొలుత తోసిపుచ్చారు. తమకు రావాల్సిన 80 లక్షల రూపాయలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తామని జూనియర్ డాక్టర్లు మొండికేశారు. దీంతో మూడు నెలల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపి ఆ విషయాన్ని తెలిపారు. దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించేందుకు అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+