వేదాద్రి: పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏ పదవి చేపట్టేందుకేనా తాను సిద్ధంగా ఉన్నానని సినీ నటుడు బాలకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన కృష్ణాజిల్లా వేదాద్రిలో యోగానంద లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అంతా దైవేచ్ఛ అని భవిష్యత్ ఎలా నిర్దేశిస్తే అలా నడుచుకుంటానన్నారు.
పార్టీ అంటే వారసత్వం కాదని, టీడీపీకి తన అండదండలు ఎప్పుడూ ఉంటాయన్నారు. తాను సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని బాలయ్య అన్నారు. మంచి కథ దొరికితే జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తానని, కథ కోసం అన్వేషిస్తున్నామన్నారు.