హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు తెలంగాణ నేతలది ఒకే మాట

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు కలసికట్టుగా శ్రీకృష్ణ కమిటీ ముందు ఒకే వాదన వినిపించాలని నిర్ణయించారు. సీడబ్ల్యూసీ సభ్యుడు కె.కేశవరావు నేతృత్వంలో కమిటీ ముందు అభిప్రాయాలు వినిపించనున్నారు. మంగళవారం తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్సీలు, కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు ఎంపీ వివేక్‌కు చెందిన రంగారెడ్డి జిల్లాలోని ఫాంహౌస్‌లో సమావేశమై శ్రీకృష్ణ కమిటీ ముందు వినిపించాల్సిన వాదనలపై విస్తృతంగా చర్చించారు. సీనియర్‌ నాయకులు కేశవరావు, కె.జానారెడ్డి, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి ఆర్‌.దామోదర్‌రెడ్డి, కె.ఆర్‌.ఆమోస్‌, ఇంద్రసేనారెడ్డి, నర్సారెడ్డి, జీవన్‌రెడ్డి, యాదవరెడ్డి, ఎంపీలు వివేక్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంద జగన్నాథం, పొన్నం ప్రభాకర్‌, సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బలరాం నాయక్‌, మధుయాష్కీ, ఎమ్మెల్యేలు బస్వరాజు సారయ్య, ప్రసాద్‌ సహా తొమ్మిదిమంది పాల్గొన్నారు.

శ్రీకృష్ణ కమిటీ ముందు వినిపించాల్సిన వాదనలు, ఎదురయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ ప్రాంతంలో జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలా? వద్దా అనే అంశంతో పాటు ఎంపీ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రపై సమావేశంలో చర్చించారు. చరిత్ర, రాజకీయం, సాంస్కృతిక, విద్య, సాగునీరు సహా ముఖ్య రంగాలపై వినిపించే వాదనలపై కసరత్తుచేశారు.శ్రీకృష్ణ కమిటీ ముందుకు వెళ్లే తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధుల బృందానికి కేకే నాయకత్వం వహించాలని కోరారు. కమిటీ ముందు పవర్‌పాయింట్‌ ప్రజేంటేషన్‌ కూడా కేకే ద్వారా ఇప్పించనున్నారు. సీడబ్ల్యుసీ సభ్యుడు కావడంతో కేకే కోసం కాంగ్రెసు అధిష్ఠానం నుంచి అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం లేఖను సిద్ధంచేసి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, హాజరైన ఎమ్మెల్యేల నుంచి సంతకాలు తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X