ఘజియాబాద్: నిథారీ హత్య కేసులో సురేందర్ కోలీకి ఘజియాబాద్ కోర్టు బుధవారం ఉరిశిక్ష విధించింది. 2006 సంవత్సరంలో ఏడేళ్ల ఆర్తీ అనే చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన కేసులో నిందితునికి కోర్టు ఉరి శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వరుస హత్యల కేసులో సురేందర్ కోలీపై సీబీఐ 16 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. సంచలనం కలిగించిన ఈ కేసును సిబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విచారించింది.