హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో 9మంది నిందితులను ఈరోజు నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మాజీ సీఎఫ్ ఓ వడ్లమాని శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో కంటి వైద్యం చేయించుకుంటానని చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణనుఈనెల 21కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బి. రామలింగరాజు ఆరోగ్య కారణాల వల్ల గత ఆరు నెలలుగా నిమ్స్ లో ప్రత్యేక గదిలో ఉంటున్న విషయం తెలిసిందే.