హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబిత గన్ మెన్ అనే ముసుగులో మోసాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద గన్ ‌మన్ ‌గా పనిచేస్తున్నట్టు నమ్మిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలు చేస్తున్న యువకుణ్ని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుని నుంచి నకిలీ గుర్తింపు కార్డు, మొబైల్ ‌ఫోన్, నాలుగు సిమ్ ‌కార్డులు, లక్షా ముప్పయివేల రూపాయల చెక్కును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ‌ఫోర్స్ డీసీపీ వీబీ కమలాసన్ ‌రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పుట్టిపల్లి గ్రామానికి చెందిన బి.వినోద్‌కుమార్ ఎలియాస్ వినోద్ (27).

మూడేళ్ల క్రితం మార్కాపురంలో 104 అంబులెన్స్ సర్వీసెస్‌లో ఇన్‌ స్పెక్షన్ ఆఫీసర్ గా ఉద్యోగం చేశాడు. ఆ తరువాత ఈ ఉద్యోగం వదిలిపెట్టి షాద్‌నగర్‌లోని దేవీ ఎంటర్‌ ప్రైజెస్‌ లో సూపర్‌వైజర్‌గా కొన్నాళ్లపాటు పనిచేశాడు. ఈ ఉద్యోగం కూడా వదిలిపెట్టి నగరానికి వలస వచ్చి హబ్సీగూడలో స్థిరపడ్డాడు. కాగా, వినోద్ సమీప బంధువులు ఇద్దరు ఆర్మీ, సీఆర్‌ పీఎఫ్ ‌ల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X