హైదరాబాదులో కానిస్టేబుల్ పై కాల్పులు

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ లో పోలీసులపైకి దుండగులు కాల్పులు జరిపిన సంఘటన శుక్రవారం హైదరాబాదులో తీవ్ర సంచలనం కలిగించింది. హైదరాబాదులోని పాతబస్తీలో గల శాలిబండలో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయారు. ముఖాలకు ముసుగులు ధరించి వారు కాల్పులు జరపడంతో వారిని గుర్తించడం కష్టంగానే ఉంది. ఈ సంఘటనతో హైదరాబాదులో హై అలర్ట్ ప్రకటించారు.

దుండగులు అతి దగ్గరి నుంచి ఛాతీకి గురి పెట్టి కాల్పులు జరపడంతో రమేష్ అనే కానిస్టేబుల్ గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతను ఐసియులో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గతంలో వికారుద్దీన్ రామారావుపై కాల్పులు జరిపిన తరహాలోనే శుక్రవారం రమేష్ పై కాల్పులు జరిగాయి. ఇది వికారుద్దీన్ పని గానీ అతని అనుచరుల పని గానీ అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+