పదవి ఇస్తే కాదనను: బాలకృష్ణ

Balakrishna
రాజమండ్రి: ప్రస్తుతం తాను తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తగా ఉన్నానని, పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధమేనని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పునరుద్ఘాటించారు. తనంతట తానుగా ఏ పదవులూ ఆశించటం లేదని, ఇస్తే కాదనబోనని బాలయ్య వివరించారు. తాను హీరోగా నటించిన తాజా చిత్రం 'సింహా' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రంలోని నారసింహ క్షేత్రాలను సందర్శిస్తున్న బాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నర్సింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. దాదాపు గంటకు పైగా ఆలయంలో పూజలు చేశారు.

తన ఇష్టదైవం శ్రీలక్ష్మీనర్సింహస్వామి అనీ, ఆయన పేరు కలిసి వచ్చేలా తాను గతంలో హీరోగా నటించిన చిత్రాలు రికార్డులు సృష్టించాయన్నారు. ఇప్పుడు 'సింహా' చిత్రం హిట్‌గా పేరు తెచ్చుకోవడం అంతా స్వామి ఆశీర్వాద బలమేనని భావిస్తున్నానని ఆయన అన్నారు. అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా అప్పనవీడులోని అభయాంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+