బైరాన్ సింగ్ షెకావత్ కన్నుమూత

షెకావత్ 1923 అక్టోబర్ 23వ తేదీన దేవీ సింగ్ షెకావత్, బన్నే కన్వర్ దంపతులకు ఖచిర్యావాస్ గ్రామంలో జన్మించారు. ఆయన సూరజ్ కన్వర్ ను వివాహమాడారు. వారికి రతన్ కన్వర్ అనే కూతురు ఉంది. షెకావత్ తన తండ్రి మరణం కారణంగా కళాశాల విద్యను అభ్యసించలేకపోయారు. రైతుగా, సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. కాంగ్రెసు వ్యతిరేక రాజకీయ నాయకుల్లో షెకావత్ అత్యంత ప్రధానమైనవారు. ఆయన 1952లో రాజకీయాల్లోకి వచ్చారు. రాజస్థాన్ లో బిజెపి రాజకీయ ప్రాబల్యానికి ఆయన విశేష కృషి చేశారు.












Click it and Unblock the Notifications