చిట్టిబాబుని చంపలేదు: మావోయిస్టులు

జెడ్పీ వైస్ చైర్మన్ సోమలింగాన్ని దారుణంగా కాల్చిచంపిన మావోయిస్టులు, ఆ దారుణ ఘటన జ్ఞాపకాలు గిరిజనుల స్మృతుల నుంచి ఇంకా చెరిగిపోక మునుపే చిట్టిబాబును కడతేర్చడానికి సిద్ధమయ్యారు. చింతపల్లి మండలం బలపం ఎంపీటీసీ సభ్యుడైన చిట్టిబాబు చేసిన నేరమల్లా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో చిత్తశుద్ధితో పాల్గొనక పోవడమేనట. శనివారం రాత్రి బలపం గ్రామంలో మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి గణేశ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాకోర్టులో చిట్టిబాబు తప్పులను ఏకరువు పెట్టారు. అతడి నేరాలను చీల్చి చెండాడారు.












Click it and Unblock the Notifications