జగన్ ను అడ్డుకుని తీరుతాం: ఎర్రబెల్లి

రాజకీయ నేతల పర్యటనలను అడ్డుకోవడం ప్రజాస్వామికమేనని ఆయన అన్నారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు హరికృష్ణ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ విషయంపై తాను హరికృష్ణతో మాట్లాడుతానని, స్థానిక పరిస్థితులను వివరిస్తానని ఆయన చెప్పారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని ఎర్రబెల్లి ఇంతకు ముందు చేసిన ప్రకటనను హరికృష్ణ వ్యతిరేకించారు. ఎర్రబెల్లి ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆయన ఓ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications