న్యూఢిల్లీ: ఎట్టకేలకు జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెర పడింది. అధికారం పంపకంపై జెఎంఎం, బిజెపిల మధ్య అవగాహన కుదిరింది. ఇరు పార్టీల మధ్య కుదిరిన అవగాహన మేరకు రొటేషన పై ఇరు పార్టీలు అధికారాన్ని చెరి సగం కాలం పంచుకుంటాయి. తొలి 28 నెలల కాలం బిజెపి ప్రభుత్వం నడుస్తుంది. బిజెపికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అర్జున్ ముండా నియమితులయ్యారు.
తదుపరి 28 నెలల కాలం జెఎంఎం ప్రభుత్వం చేస్తుంది. జెఎంఎంకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. అవగాహనలో భాగంగా ముఖ్యమంత్రి పదవికి జెఎంఎం నేత శిబూ సొరేన్ ఈ నెల 25వ తేదీన రాజీనామా చేస్తారు. అర్జున్ ముండా ముఖ్యమంత్రి పదవి చేపడతారు.