బాబు హరే కృష్ణ, హరే దయాకర్

ప్రజల మనోభావాల ప్రకారం నాయకులు పనిచేస్తున్నారని, అందులో తప్పేమీలేదని, అయితే నాయకుల మధ్య విభేదాలు కూడదని, తాను దీనిపై ఇప్పటికే అందరితో మాట్లాడానని ఆయన చెప్పారు. సంయమనం, క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరుతున్నా. ఇది సున్నితమైన సమస్య. ఏ ప్రాంత నాయకులు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ స్పష్టంగా చెబుతోందని అన్నారు. హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్నట్లు ఇంతకుముందే ఢిల్లీలో చెప్పారని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై జనంలోకి వెళ్లినప్పుడు అడ్డుకోవడం సరి కాదని, తనకు రెండుప్రాంతాలూ సమానమని, రెండూ రెండుకళ్లని చెప్పి వెళ్లానని ఆయన వివరించారు.
కొంతమంది అక్కడుండే పరిస్థితులు, జగన్‌చేసే పనులను బట్టి విమర్శిస్తున్నారని, విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే అడ్డుకోవడాన్ని మాపార్టీ ఎప్పుడూసమర్థించదు. ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రచారం వారు చేసుకోవచ్చనని, తప్పులేదని అన్నారు. లేఖల వివాదంలో నాయకులపై క్రమశిక్షణా చర్యలు అవసరం లేదని, ఇది చిన్న అంశమని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications