కెసిఆర్ విజయవాడ పర్యటన చిచ్చు

తెలంగాణలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పర్యటన తలపెట్టడం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో కెసిఆర్ నిర్ణయం చాలా మందికి మింగుడు పడడం లేదు. తెలంగాణలో పర్యటించడానికి ఏ విధమైన హక్కు ఉందో ఆంధ్ర ప్రాంతంలో పర్యటించడానికి తనకే హక్కుందని చెప్పడానికి కెసిఆర్ సిద్ధపడుతున్నారు.
కెసిఆర్ నిర్ణయం ముఖ్యమంత్రి కె రోశయ్యను కూడా ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఉంది. తెలంగాణలో తెలంగాణవాదుల సభలకు, కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. జగన్ వంటి సమైక్యవాదులు తెలంగాణలో పర్యటించడానికి మాత్రం అనుమతి లభిస్తోంది. ఈ స్థితిలో తన ఆంధ్ర పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా, లేదా అనే పరీక్షను రోశయ్యకు కెసిఆర్ పెట్టబోతున్నారు. జై ఆంధ్ర ఉద్యమానికి చేయూత ఇవ్వడానికి, ఇరు ప్రాంతాల వారు రాష్ట్ర విభజనకు కలిసికట్టుగా పోరాటం చేయడానికి కూడా ఈ పర్యటన ఉపయోగపడుతోందని భావిస్తున్నారు. తద్వారా, కోస్తాంధ్రలోని కొద్ది మంది పెట్టుబడిదారులు, వ్యాపారులు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని ఆయన చాటదలుచుకున్నట్లు కనిపిస్తోంది.
మొత్తం మీద, కెసిఆర్ విజయవాడ పర్యటన సీమాంధ్ర నేతలకు గుబులు రేపుతోంది. విజయవాడకు రావడానికి కెసిఆర్ కు ఏ విధమైన అంభ్యతరం లేదని చెబుతూనే ఆంధ్ర సంస్థల నాయకులు ఆయనకు సవాళ్లు విసురుతున్నారు. సమైక్యవాదులను తెలంగాణలో అనుమతిస్తామని ప్రకటించి విజయవాడకు రావాలని అంటున్నారు. అయితే, తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని, తెలంగాణవాదులు మాత్రమే అడ్డుకుంటున్నారని కెసిఆర్ చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలో సీమాంధ్ర నాయకులు ఎలా పర్యటిస్తున్నారో, ఆంధ్రలో తాను పర్యటిస్తానని కెసిఆర్ సవాల్ విసురుతున్నట్లే భావించాలి.












Click it and Unblock the Notifications