• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా యూనివర్సిటీకి 100 ఎకరాలు

By Santaram
|
Google Oneindia TeluguNews
Krishna Dist
మచిలీపట్నం: ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్న కృష్ణాజిల్లాలో కృష్ణా యూనివర్సిటీకి వచ్చిన భూమి సమస్య తీరింది. కృష్ణా యూనివర్సిటీకి మరో 102.86ఎకరాల భూమిని కేటాయించారు. బందరు మండలం రుద్రవరం గ్రామంలో ఈ భూమిని కేటాయిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు వీసీ ఎంకే దుర్గాప్రసాద్‌ తెలిపారు. మంగళవారం వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీంతో యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో భూమి సమకూరిం దన్నారు. చెప్పారు.

రుద్రవరం రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల పక్కనే ఉన్న సర్వే నంబర్లు 172 నుంచి 177, 182నుంచి 191, 266, 269 నుంచి 276లలోని 102.86 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ భూములను తాను పరిశీలించామన్నారు. ఇప్పటికే యూనివర్సిటీకి 150 ఎకరాల భూమి సమకూరిందని తెలిపారు. మిగిలిన 50ఎకరాల భూమిని త్వరలోనే కేటాయిస్తారని ఆశిస్తున్నామన్నారు. రుద్రవరం సమీపంలో కేటాయించిన భూమిని చదును చేయాల్సి ఉందన్నారు. కృష్ణా యూనివర్సిటీని జిల్లాలో స్థాపించడానికి అప్పటి మంత్రులు మండలి బుద్ధప్రసాద్‌, పిన్నమనేని వెంకటేశ్వరరావు, బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X