చంద్రబాబుతో బాలయ్య భేటీ

Balakrishna
హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో ఆయన బావమరిది, నందమూరి బాలకృష్ణ మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి ఏడున్నర సమయంలో చంద్రబాబు నివాసానికి వచ్చిన బాలయ్య సుమారు గంటన్నరపాటు అక్కడే ఉన్నారు. నరసింహస్వామి పుణ్యక్షేత్రాలకు 'సింహ' యూనిట్ జరిపిన పర్యటనలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. అవకాశం వస్తే పార్టీ పగ్గాలు చేపడతానని, రాజ్యసభ సీటు ఇస్తే తీసుకొంటానని బాలకృష్ణ అన్నట్లుగా వచ్చిన వార్తలు చర్చనీయంగా మారాయి. వివాదాలకు అవకా శం ఇవ్వొద్దని బాబు అప్పుడే బాలకృష్ణకు సూచించారు.

ఒకసారి తన వద్దకు వస్తే అన్నింటిపై మాట్లాడుకుందామని చంద్రబాబు కోరడంతో బాలకృష్ణ మంగళవారం ఆయన నివాసానికి వచ్చినట్లు సమాచారం. మీడియా ప్రతినిధులు రకరకాల ప్రశ్నలు వేసి తాను వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన సమాధానాలను తర్వాత కలిపివేసి గందరగోళం సృష్టించారని, పార్టీలో పోటీ నాయకత్వం సృష్టించాలన్న కోరిక తనకు లేదని ఈ సందర్బంగా బాలకృష్ణ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. విలేఖరులతో ఆచితూచి మాట్లాడటం మంచిదని చంద్రబాబు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+