తీర ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు

ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, మరో వైపు మత్య్సకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాప్రాంత జిల్లా కలెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బుధవారం ఉదయం తిరుమలలో పడిన వర్షం కారణంగా ఘాట్‌రోడ్‌లో పలు చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు ఎలాంటి ఇక్కట్లకు గురవకుండా ఉండేందుకు తితిదే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంతో జోరుగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలోని 72 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. బుధవారం అదృశ్యమైన ముగ్గురు జాలర్లు సురక్షితంగా వెనుదిరిగి వచ్చారు.












Click it and Unblock the Notifications